Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలో పిల్లలు చదువుతో పాటు కళలు, క్రీడలు అలాగే అన్ని రంగాలలో రాణించి జిల్లాకు మంచి పేరుప్రతిష్టలు అందించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు.సోమవారం స్థానిక బాలభవన్‌లో వేసవి శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు.జిల్లాలో ఉన్న బాలకేంద్రాన్ని బాలభవన్‌గా అప్‌గ్రేడ్‌గా చేయడం జరిగిందన్నారు. పిల్లల తల్లి దండ్రులు పిల్లల అభిరుచి మేరకు ప్రోత్సహించాలని అన్నారు. పిల్లలు చదువుతో పాటు మానసిక వికాసం పై మక్కువ చూపాలని ఆదిశగా అన్ని రంగాలలో రాణించాలని కోరారు.వేసవి శిబిరంలో 800 మందికి వివిధ కళలపై నాణ్యమైన శిక్షణ ఇచ్చామని తెలిపారు.బాల భవన్ నిర్మాణానికి ఇప్పటికే రెండు స్థలాలు పరిశీలించామని, రెండువేల పిల్లలు శిక్షణ పొందేలా అద్భుతమైన బాలభవన్ నిర్మించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలభవన్ వ్యవస్థాపక అధ్యక్షలు వనమా రామయ్య, మున్సిపల్ చైర్పర్సన్ పి.అన్నపూర్ణ,జిల్లా గ్రంధాలయచైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, జెడ్పి వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, కౌన్సిలర్స్ తహేర్ పాషా, బాషా, డీఈఓఅశోక్, పర్యవేక్షకులు రాధాకృష్ణ పాల్గొన్నారు.