Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
సంస్థాన్‌నారాయణపురం మండలపరిధిలోని అల్లందేవిచెర్వు గ్రామంలోని 136 సర్వేనెంబర్‌లోని తమ ఇండ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ ఆ గ్రామస్తులు సోమవారం చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ ఎస్.సూరజ్‌కుమార్‌కు వినతిపత్రం అంద జేశారు. సుమారు 70 నుండి 80 ఏండ్లుగా తమ పూర్వీకుల కాలం నుండి ఇండ్లు కట్టుకొని నివసిస్తు న్నామని, ఇందులో కొంతమంది గ్రామస్తులు రోడ్డుపైన నూతనంగా ఇండ్లు నిర్మించుకొని నివసిస్తున్నామని తెలిపారు. మరికొంతమంది ఇప్పటికీ అక్కడే నివాసముంటున్నారని పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన ధరణి పోర్టల్‌లోని లోపాలను ఆసరా చేసుకొని మా పాత గ్రామంలోని సర్వేనెంబర్ 136 వారి పేరు మీద చూపించడం వల్ల కొంతమంది రెవెన్యూ అధికారుల సహకారంతో అట్టి భూమికి పాసుపుస్తకాలు పొంది రైతుబంధు కూడా తీసుకుంటున్నారని తెలిపారు. గ్రామాన్ని సందర్శించి వారు పొందిన పాసుపుస్తకాలు రద్దుచేసి ఇట్టి ఇండ్ల స్థలాలను తమకు ఇప్పించాలని విజ్ఞప్తిచేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సుర్వి రాజుగౌడ్, రవిగౌడ్, గుండు జంగయ్యగౌడ్, సుర్వి కిష్టయ్య, వెంకటయ్య, బాత్క జంగయ్యయాదవ్, సుర్వి లింగస్వామిగౌడ్ ఉన్నారు.