Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళ సిబ్బందిపై వేధింపులు?
- మహిళపై కక్ష సాధింపు
- సమయపాలన పాటించని సిబ్బంది
- ఫోన్లో మాట్లాడుతూ ఇంజక్షన్లు.
- విధి నిర్వహణ మంచి నిద్రలో
- భువనగిరి పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్వాహకం
లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం మందులు కొనుగోలు చేసి ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేయడానికి ఒకవైపు కషి జరుగుతుంటే మరోవైపు మందులు నేలపాలు అవుతున్నాయి. ఆశా వర్కర్లు, మహిళా సిబ్బందిపై అందులో పనిచేస్తున్న అడ్డ గూడూరు నుండి డిప్యూటేషన్ పై భువనగిరికి వచ్చిన హెల్త్ అసిస్టెంట్ ఒకరు లైంగిక వేధింపులు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఆమే ఉన్నత అధికారులకు తెలిపిన వారు సారీ చెప్పించి చేతులు దులుపుకున్నారని తెలిసింది. ఒక మహిళ ధైర్యంగా తన పై లైంగిక వేధింపులు చేస్తున్నారని ఉన్నత అధికారులకు తెలిపిన అతనిపై చర్య తీసుకోకపోవడం బాధాకరం. దీంతో మిగతా మహిళలు అతనిపై ఫిర్యాదు చేయాలంటే జంకుతున్నారు. మహిళా సిబ్బంది తన మాట వినక పోతే వారి పై కక్ష సాధింపు చేస్తున్నట్టు సమాచారం.
మందులు మట్టిపాలు.?
నవతెలంగాణ - భువనగిరి
కరోనాలో మంచి పేరుతెచ్చుకున్న భువనగిరి పట్టణ అర్బన్ కాలనీలోని అర్బన్ హెల్త్ సెంటర్ జిల్లా వ్యాప్తంగా మంచి పేరు రావడంతో ఇంకా చాలు అనుకున్నారో గడువు ముగిసిన మందులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. పిజిషియన్ ద్వారా రోగులకు అందించాల్సిన కొన్ని మందులు కూడా ఉండడంతో స్థానిక డాక్టర్లు నేరుగా ఇవ్వలేకపోయరని తెలిసింది. నేడు లక్షలాది రూపాయలతో కొనుగోలు చేసి సరఫరా చేసిన మందులు ప్రజలకు అందించడంలో జాప్యం జరిగి అవి చివరకు గడువు ముగిసి మట్టి పాలవుతున్నాయి. మందులు ప్రజా అవసరాల రీత్యా వాడకం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
సమయపాలన పాటించని సిబ్బంది
హెల్త్ సెంటర్లో కొందరి ఏఎన్ఎంలు, ఆశాలు ఇతర సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. కోందరు సిబ్బంది ప్రజా ఆరోగ్య సేవ లో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
సెల్‌ఫోన్ ఒకవైపు ఇంజెక్షన్లు మరో వైపు
తన ఆరోగ్యం బాగా లేదని వచ్చిన రోగులకు డాక్టర్ పరీక్షించిన తర్వాత ఇవ్వాలని డాక్టర్ సూచన మేరకు మహిళా సిబ్బంది ఒకవైపు సెల్ ఫోన్ మాట్లాడుతూ మరోవైపు ఇంజక్షన్లు ఇస్తుంది. ఇంజక్షన్ ఎక్కడ ఎలా ఇస్తుందో పట్టించుకోవడం లేదు. రోగులు మరింత నొప్పికి గురవుతున్నారు. నేను రాను కొడుక సర్కారు దవాఖానకు అనే విధంగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు.
సేవలకు సున్న... నిద్ర నే మిన్న
కొందరు సిబ్బంది ఆలస్యంగా రావడమే కాకుండా ప్రజలకు సేవ చేయకుండా ఫ్యాన్ కింద కూర్చొని సేద తీరుతున్నారు. మరి కొందరు మరో అడుగు ముందుకేసి నిద్రలో జారుకుంటున్నారు. రోగులు వచ్చిన వారికి సేవలు అందించడం లేదు. ప్రజలు, రోగులు వైద్య సేవల కోసం ముందస్తుగా వస్తే వారు విధులోకి ఆలస్యంగా రావడం. రోగులు ఆలస్యంగా వస్తే ఇంత లేటుగా వస్తారా రేపు రా అని చెప్పడం వైద్య సిబ్బందికి షరా మామూలుగా మారింది.
విచారణ జరుగుతుంది. డాక్టర్ వివేక్.
తనపై లైంగిక వేధింపులు జరుపు తున్నారని ఆశావర్కర్ ఆ విషయం డీఎంహెచ్ఓకు తెలియ జేయడంతో వారు ఇప్పటికే అసిస్టెంట్‌కు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతు న్నారని అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ వివేక్ తెలిపారు. రోగులకు అందుబాటులో ఉండు సరైన మందులు అందజేస్తున్నామని కొన్ని మందులు మాత్రం గడువు ముగిసిన మందులు ఉన్నాయన్నారు. వాటిని డ్రగ్ పాలసీ వచ్చిన తర్వాత అధికారులకు పంపిస్తామన్నారు.