Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ పంచాయతీ రెవెన్యూ పరిధిలోని 758 సర్వే నెంబర్లో 321 మందికి కేటాయించిన ఇండ్ల స్థలాలను టీఎస్ఐఐసీ వారు భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారని, ఇట్టి భూ సేకరణ నోటిఫికేషన్ రద్దుచేయాలని కోరుతూ సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సూరజ్‌కుమార్‌కు జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ ఎలువర్తి యాదగిరిల ఆధ్వర్యంలో ప్రజలు వినతిపత్రం అందజేశారు.758 సర్వేనెంబర్లో 321 మందికి గతంలో ప్రభుత్వం ఇండ్ల స్థలాల కోసం ప్రతి ఒక్కరికి ఒక గుంట చొప్పున పట్టాలు ఇచ్చినట్టు తెలిపారు. గతంలో వందల ఎకరాల భూమి కోల్పోవడంతోపాటు నాడు ప్రభుత్వం ఇండ్ల స్థలాలకు కేటాయించిన భూమి కూడా కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పలుమార్లు కలెక్టర్, ఆర్డీఓలకు భూసేకరణ నోటిఫికేషన్ రద్దుచేయాలని వినతిపత్రాలు ఇచ్చినట్టు తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ సర్పంచ్ పబ్బు రాజుగౌడ్, ఉపసర్పంచ్ మల్కాజిగిరి కష్ణ, ఈడ్దుల హరిప్రసాద్, అత్తాపురం నరేందర్‌రెడ్డి, మీసాల శ్రీను, బొంతల ఓంప్రకాశ్ ఉన్నారు.