Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసులకు భయపడి తే సమస్యలు పరిష్కారం కావులి
- పోరాటంతోనే సమస్యలు పరిష్కారం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
73 రోజులుగా కొండపైకి ఆటోలను అనుమతించాలని కార్మికుల దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆటో కార్మికఁల దీక్షలను హైదరాబాద్ వరకు తీసుకెళ్తా మని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.సోమవారం ఆటో కార్మికుల దీక్షా శిబిరాఁ్న ఆయన సందర్శించి దీక్షకు మద్దతు తెలిపారు.ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీస్ కేసులకు భయపడితే సమస్యలు పరిష్కారం కావన్నారు. పోరాటంతోనే ఫలితాలు వస్తాయఁ ఆయన తెలిపారు. 73రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా ఉద్యమాన్ని బలహీనపరిచేలా చూస్తుందన్నారు. ఇప్పటికైనా ఆటో కార్మికులు ఐక్యంగా గా పోరాటాఁకి సిద్ధపడితే సీపీఐ(ఎం) వారికి పూర్తిగా అండగా ఉంటుందన్నారు. కొండపైకి బస్సులు నడపొద్దు అని ఎవరూ అనడం లేదు.. ఆటోలు నడిస్తే ఎవరికీ ఇబ్బంది అవుతుందో ప్రభుత్వం చేప్పాలన్నారు. గవర్నమెంట్ నిర్ణయమంటూ దేవస్థానం ఈవో ఇటు ఎమ్మెల్యే అంటున్నారని ఈ విషయం ఎవరి చేతిలో ఉందో స్పష్టంగా తెలపాలని డిమాండ్ చేశారు. ఆటోలను కొండ పైకి అనుమతించవద్దని ఆర్డర్ కాపీ ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. పోలీస్ బలంతోనే ఆటో కార్మికులను ఆపేందుకు చుస్తున్నార న్నారు. గట్టి పోరాటాఁకి సిద్ధం అయితే ప్రభుత్వం దిగిరాక తప్పదన్నారు. ప్రజల వ్యతిరేకత రాజకీయంగా దెబ్బతీస్తుంది అన్నప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. ప్రజల మద్దతు కోసం ఆటో కార్మికులు గ్రామాల్లోకి వెళ్లాలన్నారు. ప్రయాణికులకు కూడా ఆటోలు నిషేధంపై ప్రచారం చేయాలన్నారు. ఈ సమస్యను పెద్ద సమస్యగా చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుందని అవసరమైతే హైదరాబాదులో అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఆటో కార్మికులు తమ్మినేనికి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సీపీఐ(ఎం), సీపీఐ జిల్లా కార్యదర్శులు ఎండి.జహంగీర్, గోదా శ్రీరాములు , సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు, ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం, సీపీఐ(ఎం)ం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింలు మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ, నాయకఁలు కళ్లేం కష్ణ,గోపగాని రాజు, అనంతుల నరసింహ, పాకలపాటి రాజు , ఆటో కార్మికులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువు : తమ్మినేని
భువనగిరి : రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తపరిచారు. మంగళవారం ఆ పార్టీ జిల్లా కమీటీ ఆధ్వర్యంలో పట్టణంలోని రాధాకృష్ణ హాల్లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులకు సోమవారం తమ్మినేని హాజరై మాట్లాడారు.రాష్ట్రంలో మహిళలపై లైంగికదాడులు జరుగుతున్నాయని వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ యాదాద్రి అద్భుతంగా తీర్చిదద్దిన కేసీఆర్ 30, 40 ఏళ్ల వ్యాపారాలు చేస్తున్న, ఆటోలు నడుపుకుంటూ ఉన్న కార్మికులు గుట్ట పైకి రాకుండా చేశారన్నారు. ధనవంతుల దేవాలయం గా మార్చారనివిమర్శించారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆదరణ పెరిగిందన్నారు. దేశంలో కమ్యూనిస్టులు కావాల్సి ఉందన్నారు. పార్టీ తీసుకున్న తీర్మానాలను నిర్ణయాలను వివరించారు. క్షేత్రస్థాయిలో మరింత పని చేసి ప్రజా పోరాటాలు నిర్మించాల్సిగా కోరారు. కార్పొరేట్ శక్తులు బూర్జువా పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా కమ్యూనిస్టులకు ప్రజలలో ఆదరణ తగ్గలేదు అని పేర్కొన్నారు. పోరాటాలు చేసేటప్పుడు మెతకవైఖరి ప్రదర్శించవద్దని కోరారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని అవకతవకలు పెద్దఎత్తున జరుగుతున్నాయన్నారు. ప్రజలకు రాజకీయ చైతన్యం తీసుకురావాలని కోరారు. .దీనితో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరం చేయకుండా మతాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మటూరి బాలరాజు, దునూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం,దాసరి పాండు, కొమ్మటి రెడ్డి చంద్రారెడ్డి,మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జెలెలా పెంటయ్య,బొడ్డుపల్లి వెంకటేశం,మదేలా రాజయ్య,సిర్పంగి స్వామి, ఎండి.పాషా,బురు కష్ణ రెడ్డి, గంగాదేవి సైదులు,మాయ కష్ణ,బొల్లు యాదగిరి, గుండు వెంకట నర్సు,బాబురి పోశెట్టి,ఎగ్బాల్,బోలాగని జయరాములు, యాది రెడ్డి,గడ్డం వెంకటేష్,లింగారెడ్డి,మద్దెపురం రాజు,రాములమ్మ, నాయకులు బుర్రు. అనిల్ కుమార్, రాములు, శ్రీరాములు, దేవేందర్ రెడ్డి, గాడి శ్రీను, వనం రాజు, తదితరులు పాల్గొన్నారు.