Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మఠంపల్లి
మండలంలోని మట్టపల్లి వద్దగల ఒకటవసర్వే నెంబర్లో అనేక ఏండ్లుగా నివాసముంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లునిర్మించి ఇవ్వాలని కోరుతూ సీపీఐఎం జిల్లాకమిటీ సభ్యులు భూక్యాపాండు నాయక్,నాగారపుపాండు బాధితులతో కలిసి హుజూర్నగర్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టపల్లి1వ సర్వేనెంబర్లో 15 మందినిరుపేదలు చాలాకాలంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని,వారిని తొలగించేందుకు అధికార పార్టీకి చెందిన కొందరు చూస్తున్నారని విమర్శించారు.నివాసం ఉంటున్న వారికి ఇళ్ల పట్టాలుఇచ్చి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఇవ్వాలని కోరారు. వినతిపత్రం అందజేసినవారిలో ఆర్.వాలీ, వినోద్,దాసు,రూప, రమేష్,చిన్న ఉన్నారు.