Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపాలిటీలో మంగళవారం నాల్గో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 9వ వార్డులో నిర్వహించిన పనులను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి పరిశీలించారు.పట్టణంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను తొలగించాలని మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం కలెక్టర్‌ను కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నర్సింహారెడ్డిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దండ హిమబిందుఅరుణ్కుమార్, పోలోజు శ్రీధర్‌బాబు, ఆలె నాగరాజు, నాయకులు బొడిగె బాలకష్ణగౌడ్, గోశిక నర్సింహా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.