Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్థివదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని నిర్ణయం
నవతెలంగాణ-భువనగిరిరూరల్
మండలంలో పిల్లాయి పల్లి గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి 80 ఏండ్లు పూర్తి చేసుకుని, 81వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు.తన మరణానంతరం తన పార్థివదేహాన్ని అంతిమ దహనసంస్కారాలు సంప్రదాయం ప్రకారం కాకుండా మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మెడికల్ కాలేజీకి అప్పజెప్పడానికి నిర్ణయం తీసుకున్నారు.ఆ నిర్ణయానికి కుటుంబసభ్యులు ఒప్పుకున్నట్టుగా హామీ పత్రాన్ని పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములుకు జిల్లా కార్యదర్శి జహంగీర్‌కు రాయగిరిలో జరిగిన జిల్లా క్లాసులలో అందించారు.