Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి
నవతెలంగాణ-తిరుమలగిరిసాగర్
తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొర్రాశంకర్నాయక్పై తప్పుడు కేసును నమోదు చేయించిన ఫారెస్టు అధికారులు రాజవరం సెక్షన్‌ఆఫీసర్ మానస,బీట్ ఆఫీసర్ అన్నపూర్ణలను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం ఎల్లాపురంతండాలో ఫారెస్ట్ అధికారులు బేస్ క్యాంప్ 17 .5. 2022న రమావత్ స్వామి పొలంలో ఏర్పాటు చేశారు.18న ఉదయం రమావత్ స్వామి వచ్చి తన పొలంలో ఫారెస్టు అధికారులు బేస్ క్యాంపు ఏర్పాటు చేశారని శంకర్‌నాయక్‌తో చెప్పడంతో వారు బేస్‌క్యాంప్ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్న ముగ్గురు వాచర్లతో మాట్లాడారు.ఆ సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్ అయినా మానస, అన్నపూర్ణ అక్కడ లేరన్నారు.బేస్‌క్యాంపు పెట్టిన ప్రదేశం రెవెన్యూ పట్టాభూమిలో ఉందన్నారు.గతంలో కూడా ఆ వాచర్లు బుజ్జి అనే గిరిజన మహిళ రైతు ట్రాక్టర్ తాళం తీసుకుని ఇబ్బందిపెట్టారన్నారు.ఈ విషయమై శంకర్‌నాయక్ ప్రశ్నించగా తప్పుడు కేసులు నమోదు చేయించారన్నారు.సంబంధం లేకుండా తప్పుడుకేసులు నమోదు చేయించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని కోరారు.అమాయక గిరిజనులపై ఫారెస్టు అధికారులు ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతు న్నాయన్నారు.అటవీ హక్కుల చట్టాన్ని లెక్కచేయకుండా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టడం సరికాదన్నారు.ఒక పక్క ప్రభుత్వం గిరిజనులు సాగు చేసుకున్న భూములకు పట్టాలు ఇస్తామని చెబుతున్నా ఫారెస్ట్ అధికారులు దాడులు రోజురోజుకు పెరిగిపోతు న్నాయన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజనసంఘం జిల్లా కార్యదర్శి కొర్రా శంకర్‌నాయక్, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్, బలరాం, ముని పాల్గొన్నారు.