Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజకబజారులో మురికికాలువకు మరమ్మతులు
నవతెలంగాణ-మోత్కూరు
మున్సిపల్ కేంద్రంలోని రజక బజారులో మరమ్మతు కోసం తవ్వి వదిలేసిన మురికి కాల్వను మంగళవారం మున్సిపల్ అధికారులు మరమ్మతు చేయించారు.రజక బజారులో మురికి కాల్వ మరమ్మతు కోసం తవ్వి వదిలేసి రెండు నెలలవుతున్నా మరమ్మతు చేయకపోవడంపై 'నవతెలంగాణ'లో ప్రచురిం చిన 'పట్టణ ప్రగతి లోనైనా మరమ్మతు చేస్తారా..?' అన్న కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కాలువను పరిశీలించి సిబ్బందితో మరమ్మతు పనులు పూర్తి చేయించారు.పూడిపోయిన కాల్వను శుభ్రం చేసి,దెబ్బతిన్న లైనింగ్‌ను సిమెంట్ ఇటుకలతో మరమ్మతుపనులు చేయించారు.కాలువను తవ్వి బజారుకు ఎత్తుగా పోసిన మట్టిని చదును చేయించి మురికికాల్వపై బండలు వేసి బాటను పునరుద్ధరించారు.ఆటోలు, ఇతర వాహనాలు వెళ్లేలా గతంలో మాదిరిగా సీసీస్లాబ్ వేయించాలని ప్రజలు కోరుతున్నారు.