Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కమిషనర్ రమణాచారి
నవతెలంగాణ-నల్లగొండ
పట్టణంలోని ప్రతివార్డులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కెవి.రమణాచారి అన్నారు.మంగళవారం ఆయన వార్డు కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్,మున్సిపల్ సిబ్బందితో పట్టణ ప్రగతి,వార్డు వాచ్ కార్యక్రమంలో భాగంగా 28వ వార్డులో విస్తతంగా పర్యటించారు.వార్డులో కంపచెట్లను తొలగించాలని, కొత్త నల్లాకనెక్షన్లు ఇవ్వాలని, నీళ్ళు వృథాకాకుండా గేట్వాల్స్కు మరమ్మతులు చేయాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు చాంబర్లు, మూతలు ఏర్పాటు చేయాలన్నారు. స్ట్రీట్ లైట్స్పోల్స్లకు శిథిóలావస్థలో ఉన్న కరెంటుబాక్సులను తొలగించి కొత్తబాక్సులు ఏర్పాటు చేయాలన్నారు. పాతబస్తీలో నూతనంగా నిర్మించిన రోడ్డు వెంట ప్రతి 3 మీటర్ల దూరంలో మొక్కలు నాటాలని తెలిపారు.అనంతరం కొండ చెల్మ గ్రేవియార్డును సందర్శించి రోడ్లు, లైట్లు, మంచినీటి సదుపాయం, బాత్రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు.పట్టణంలోని అన్ని గ్రేవియార్డులకు సంబంధించిన వసతిసౌకర్యాల వివరాలను తెలియజేయాలని సిబ్బందికి ఆదేశించారు.ప్రతి వార్డులోని యువత వారంలో ఒక రోజు నేను- నావార్డు అనే కార్యక్రమంతో శ్రమదాన కార్యక్రమం నిర్వహించి వార్డులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి తెలిపారు.అనంతరం 47వ వార్డులో మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్‌తో కలిసి కలిసి పర్యటించారు .పాత భవనాలు, పిచ్చిమొక్కలు తొలగించాలని, డ్రైనేజీ కాలువలకు మరమతులు, సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.మున్సిపల్ వైస్‌చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్ మాట్లాడుతూ 4వ విడత పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీ కాలువలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈగలు, దోమలను అరికట్టి విషజ్వరాలు, అంటువ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చన్నారు. తడి,పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు ఇవ్వాలని వార్డు ప్రజలకు తెలిపారు. అలాగే శిధిలావస్థ లో ఉన్న భవనాలను తొలగించాలని కమిషనర్ తెలిపారు.అనంతరం చర్లపల్లి అర్భన్పార్కు పనులైన పార్కింగ్,ఎంట్రెన్స్, షాపింగ్ కాంప్లెక్స్, డ్రైనేజీ కాలువల నిర్మాణ, గజబో, కౌంపాండ్ వాలు నిర్మాణపనులను పరిశీలించారు.మర్రిగూడ జంక్షన్ వద్ద జరిగే పేయింటిగ్, ఫ్లోరింగ్, ప్లాంటేషన్పనులను పరిశీలించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంజనీర్లు, డీఈ నర్సింహారెడ్డి, ఏఈలు వినోద్, దిలిప్,ఏసీపీ నాగిరెడ్డి, శానిటరి ఇన్స్పెక్టర్లు మూర్తూజా, శశిధర్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.