Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తా
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
మండలంలోని తాజ్పూర్ గ్రామంలో సోమ వారం సాయంత్రం భువనగిరి మండల తాజ్పూర్ గ్రామంలో హెచ్ఎండిఎ నిధులతో , ఎస్డిఎఫ్ నిధులతో పలు అభివద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.ముందుగా ఎమ్మెల్యేలకు తాజ్పూర్ గ్రామ ప్రజలు డప్పు, వాయిద్యాలు,డోలు,తల్ల్లాలతో, లంబాడీ సాంస్కతిక నత్యాలతో గ్రామసర్పంచ్ బొమ్మరపు సురేష్,టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు.వివిధ అభివద్ధిపనులకు శంకుస్థాపన చేశారు.గ్రామంలో వివిధ పార్టీల నుండి 40 మంది యువత రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే మంచి పథకాలకు , ఎమ్మెల్యే చేసే మంచిపనులకు ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరారు. గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన 24 కుటుంబాలకు పైళ్ల పౌండేషన్ తరఫున ఒక్కో కుటుంబానికి 5 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా ఇంతగా ఆదరించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.తనను గెలిపించిన ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటానని ప్రజా సేవ చేసే అవకాశం కల్పించిన ఆ దేవుడికి ధన్యవాదాలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ప్రతి గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయన్నారు.తాజ్పూర్ గ్రామంలో ఉన్న 27 దళిత కుటుంబాలకు దళితబంధు పథకంతో లబ్దిచేకూర్చడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మారపు సురేస్, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామియాదవ్, జెడ్పీటీసీ సబ్బూరు బీరుమల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాసు రమేష్‌గౌడ్,పీఏసీఎస్ భువనగిరి చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు ,జిల్లా నాయకులు బల్గూరి మధుసూదన్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు జనగాంపాండు, ఓం ప్రకాష్‌గౌడ్, రైతు సమన్వయ కమిటీ కో ఆర్డినేటర్ కంచి మల్లయ్య, మాజీ ఎంపిపి కేశవపట్నం రమేష్,మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్‌గౌడ్, యూత్ అధ్యక్షుడు నాగేంద్రబాబు,వివిధ గ్రామాల సర్పంచులు చిందం మల్లికార్జున్, ఎడ్ల రాజిరెడ్డి, జాక్క కవిత రాఘవేందర్‌రెడ్డి,చిన్నం పాండు, బోయినిపాండు, జె.కవిత,సతీష్, పవన్, ఉపసర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాల శ్రీనివాస్, మండల యూత్ ప్రధానకార్యదర్శి పోల ప్రవీణ్, మండల సీనియర్ నాయకులు ఓరుగంటి రమేష్, ఓరుగంటి నాగయ్య, తాజ్పూర్ పాలక వర్గం, గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.