Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
రోజుకు 10 నుండి 12 గంటలు పని చేస్తున్న డెలివరీ కేసులాంటివి ప్రత్యేక పరిస్థితుల్లో రెండు మూడు రోజులు ఆస్పత్రి వద్ద ఉండాలి వస్తున్నప్పటికీ ఆశా కార్మికులకు సరైన వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆశా వర్కర్లకు నెలకు పదివేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. గరిడేపల్లిలో ఆశాలను ఉద్దేశించి మాట్లా డుతూ బీపీ,షుగర్, థైరాయిడ్ వ్యాధుల ఇంటింటి సర్వే చేసి ఒక వ్యక్తి సమాచారాన్ని 40 నుండి 60 ప్రశ్నలు ఆన్లైన్లో సమాధానాలు పంపించాలి వస్తుందన్నారు.దాదాపు 32 రకాల రికార్డులు రాయాల్సి వస్తున్నప్పటికీ మెటీరియల్ ప్రభుత్వం సప్లై చేయక వారిపై ఆర్థిక భారం పడుతుందని విమర్శించారు.ఆశావర్కర్లకు నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలని, 2021 జూలై నుండి డిసెంబర్ వరకు పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్సు బకాయిలు వెంటనే చెల్లించాలని, పారితోషికం లేని అదనపుపనులు ఆశాలతో చేయించ కూడదన్నారు.వారికి ప్రమాదబీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా సభ్యులు ఎస్కె.యాకుబ్, రమణ,మీరమ్మ, కవిత పాల్గొన్నారు.