Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ భవనం పెచ్చులూడుతున్నది. భవనం అక్కడక్కడ నెర్రెలు పట్టింది. బస్టాండ్‌లోకి వెళ్లే ముందరి భాగంలో మెట్ల వద్ద పగుళ్లు పట్టి పెచ్చులూడి రాలిపోతూ ఇనుపచువ్వలు తేలాయి.సిమెంట్ పెళ్లలు ఎప్పుడు ఊడి ఎవరి మీద పడి గాయపడతారోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.బస్టాండ్ ఆవరణ, పరిసరాలు కూడా చెత్తాచెదారంతో పేరుకుపోయి అపరిశుభ్రంగా తయారై దుర్వాసన వెదజల్లుతుంది.బస్టాండ్‌లోని హోటల్,దుకాణాల అద్దెల ద్వారా ఆర్టీసీకి నెలకు రూ.30వేలకు పైగా ఆదాయం వస్తోంది.ఆర్టీసీ అధికారులు స్పందించి భవనాన్ని మరమ్మతు చేయించాలని, బస్టాండ్ ఆవరణ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా బస్టాండ్ బోర్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అని ఉండటంతో తెలంగాణ వచ్చి ఎనిమిదేండ్లవుతున్నా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా పేరు మార్చకపోవడంపై మోత్కూరుకు చెందిన పంగ నర్సింగరావు ట్విట్టర్లో ఆర్టీసీ ఎండి సజ్జనార్‌కు ట్యాగ్ చేయగా స్పందించిన ఆయన పేరు మార్చాలని యాదాద్రి డిపో మేనేజర్‌ను ఆదేశించారు.