Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున
నవతెలంగాణ -నల్లగొండ
కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా 8వ మహాసభలు ఈ నెల 19, 20వ తేదీలలో హాలియాలో జరగనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్లో ఆ సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా మండల గ్రామ మహాసభలు పూర్తిచేసుకొని 300 మంది ప్రతినిధులతో హాలియా లో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 19 న ధళితుల సంక్షేమం-ప్రభుత్వాల పాత్ర అంశంపైనా సెమినార్ వుంటుందని తెలిపారు. 20 ఉదయం 10 గంటలకు జెండావిష్కరణ వుంటుందని తెలిపారు. ఈమహసభలకు ముఖ్య అతిధిగా సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అద్యక్షులు జాన్ వెస్లీ హాజరుకానున్నట్టు చెప్పారు. జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలు ,భవిష్యత్తులో నిర్వహించబోయె ఉద్యమాల గురించి చర్చించీ కార్యచరణ ర్షుపొందిచనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరుష రాములు ,జిట్ట నాగెష్ జిల్లా ఉపాధ్యక్షులు దైద శ్రీను,గాదే నర్సింహ్మ , బొట్ట శివ , జిల్లా కమిటీ సభ్యులు దొంతల నాగార్జున, బొల్లు రవీందర్ కొడిరెక్క మల్లన్న దొంతాల నాగార్జున గంటెకంపు రమనయ్య చిలుముల రామస్వామీ వంటెపాక క్రిష్ణ బొంగరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.