Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు ఎస్పీ జి.మనోహర్
నవతెలంగాణ- నల్లగొండ
ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా అడిషనల్ ఎస్పీ జి మనోహర్ అన్నారు. మంగళవారం ప్రపంచ రక్త దాతలు దినోచ్చవం సందర్భంగా జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్ లచ్చు నాయక్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దానం కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ కనీసం సంత్సరానికి 3 సార్లు రక్త దానం చేయాలన్నారు. అని ఎంతో మంది పేద ప్రజలకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు.ఈ కార్యక్రమంలో 2 టౌన్ యస్. ఐ రాజశేఖర్ రెడ్డి,మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ నిత్యానంద్ పోలీస్ యూనిట్ హాస్పటల్ డాక్టర్ ప్రదీప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.