Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక విలువలు కాపాడాలి
- సీపీఐ(ఎం)రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
దేశంలో మతోన్మాద శక్తులు బుసలు కొడుతూ.. లౌకిక విలువలపై దాడులు సాగిస్తున్నాయని ఈ మతోన్మాద శక్తులను ఒంటరి చేస్తూ లౌకిక విలువలను కాపాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని అవురవాణి గ్రామంలో ఆ పార్టీ రాజకీయ చైతన్య ఒకరోజు శిక్షణా తరగతులు నిర్వహించారు. పార్టీ జెండాను ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శ్రీరామోజు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ప్రారంభమైన శిక్షణా తరగతులకు ప్రిన్సిపాల్‌గా మండల పరిషత్ ఉపాధ్యక్షులు కల్లూరి యాదగిరి గౌడ్ వ్యవహరించారు. శిక్షణా తరగతులు అధ్యాపకునిగా తుమ్మల వీరారెడ్డి హాజరై మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగంపై, లౌకికవాదంపై దాడులు జరుగు తున్నాయన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రణాళికాబద్ధంగా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో బడా బాబులకు ఊడిగం చేస్తూ ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారన్నారు. ప్రజలపై భారాలు వేస్తూ ప్రభుత్వ వ్యతిరేకతను పక్కదోవ పట్టించేందుకు గాను మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చెప్పారు. మతతత్వ శక్తులు ఆర్ఎస్ఎస్, సంఘపరివార్ లాంటి వారు దేశాన్ని మత రాజ్యాంగంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సీఐఏ , ఎన్ ఆర్సీి, త్రిబుల్ తలాక్, తదితర అంశాలను మైనార్టీ టార్గెట్ చేస్తూ మత విద్వేషాలురెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం సామాజిక శక్తులపై దాడులు చేస్తూ ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ భయ బ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నాయకులపై తప్పుడు కేసులు , బనాయిస్తూ , దాడులు వేగవంతం చేసిందన్నారు. బీజేపీ నాయకులు ముకుర్ శర్మ, మహమ్మద్ ప్రవక్త పై అనుచిత వ్యాఖ్యలు చేసి దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే గల్ఫ్ దేశం, భారత స్వయంప్రతిపత్తి చెడగొట్టి విధంగా చేయడంతో గల్ఫ్ దేశాలు ఒత్తిడి కారణంగా బీజేపీ నుండి సస్పెండ్ చేశారని చెప్పారు. ఇటీవల కొంతమంది ఎంపీలు ఆమె మాటలను బలపరుస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ముస్లిం యువకులు ప్రశ్నిస్తే వారిపై తప్పుడు కేసు నమోదు చేసి వారి ఇండ్లపై దాడులు చేసి కూల్చివేస్తున్నారన్నారు. దేశంలో మతతత్వాన్ని ఒంటరితనం చేస్తేనే రాజ్యాంగ పరిరక్షణ జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మండల కార్యధర్మి చేర్‌కు. పెద్దులు, చింతపల్లి. బయన్న, ఎస్ కే. నన్నెసాబ్, దండు రవి(క్రిష్ణరెడ్డి, కంఠ మహేశ్వరం, యందగిరిరెడ్డి, రామచంద్రం,సైదులు, ద ఎస్ఎఫ్ ఐ డివిజన్ కార్యదర్శి గోపితన్వీర్ తదితరులు పాల్గొన్నారు.