Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సహకారంతో అన్నిరంగాల్లో సమగ్రాభివద్ధి
నవతెలంగాణ-సూర్యాపేట
గత ప్రభుత్వాలు 70 ఏండ్ల కాలంలో చేయని ఎంతో అభివద్ధిని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఏడేండ్ల కాలంలో చేశారని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.పట్టణ ప్రగతిలో భాగంగా మంగళవారం పట్టణంలో 41వ వార్డులో రూ 7.60లక్షల వ్యయంతో అంతర్గత సీసీ డ్రెయిన్, కల్వర్టు నిర్మాణం, 15వ వార్డులో రూ 30లక్షలతో అంతర్గత సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణం, 1వ వార్డులో రూ 14.60లక్షలవ్యయంతో సీసీ రోడ్లు, డ్రయినేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయా వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి సహకారంతో సూర్యాపేట పట్ట ణాన్ని అన్ని రంగాల్లో అభివద్ధి చేసేందుకు మున్సిపల్ పాలకవర్గం, అధికారులు కషి చేస్తున్నామన్నారు. శివారు కాలనీల్లో సైతం అనేక అభివద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ సమస్యలను పరిష్కరిస్తు న్నామన్నారు. అనంతరం ఆయా వార్డుల్లో పర్యటిస్తూ రోడ్లు, డ్రయినేజీలు, చెత్త కుప్పలను పరిశీలించి ప్రజలకు, అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ పుట్టా కిశోర్, ఆయా వార్డుల కౌన్సిలర్లు ఎండీ షఫీవుల్లా, ఎలిమినేటి అభినరు, వేములకొండ పద్మ, జ్యోతి శ్రీవిద్య కరుణాకర్, ఆకుల కవితలవకుశ, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు స్వరూపరాణి, టీఆర్ఎస్ నాయకులు ఎలిమినేటి రమేష్, టీఆర్ఎస్ నాయకులు అయూబ్‌ఖాన్, సకినాల జానయ్య, లింగయ్య, వెంకన్న, నర్సింగ్ నాయక్, రవి, శ్రీకాంత్ రెడ్డి, సుధీప్, శ్రీను, రాణి, సంధ్య ఏఈలు సుమంత్, రాజిరెడ్డి, జవాన్లు సారగండ్ల శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, హెల్త్ అసిస్టెంట్ సురేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.