Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులు తనిఖీలు చేపట్టాలి
- అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో ఎక్కడ కూడా డీజిల్, పెట్రోల్ సరఫరాలో కొరత చూపొద్దని ఎంఎస్,హెచ్ఎస్డీి బంకుల యాజమానులు, సంబంధిత కంపెనీ సేల్స్ అధికారులను కలెక్టర్ (పౌర సరఫరాలు) యస్. మోహన్‌రావు ఆదేశించారు.మంగళవారం తన ఛాంబర్లో పెట్రోల్, డీజిల్ సరఫరాలో కొరత నివరణపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్ఓ విజయలక్ష్మితో కలిసి మాట్లాడారు.బంకుల సెల్స్ అధికారులు అత్యధికంగా డీజిల్, పెట్రోల్ సరఫరా చేయడానికి వెంటనే చర్యలు ఇసుకోవలని లేనిచో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అలాగే డీలర్స్, హెచ్ పీసీఎల్, ఆర్టీసీ, సిమెంట్ ఫ్యాక్టరీస్, పారిశ్రామిక సంస్థలు,వినియోగదారుల బల్క్ కొనుగోలుదారులు మార్కెట్లో ధరల విషయంలో ఎక్కువగా చెల్లించాల్సి ఉన్నందున వాటికి తప్పించుకునే ఉద్దేవంలోని బల్క్ కొనుగోలుదారుల రిటేల్ అవుట్లెట్ నుండి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంతో కొరత ఏర్పడింద న్నారు.అలాగే రిలయన్స్, ఎస్సార్ సంస్థలు తమ అవుట్ లెట్ల ద్వారా విక్రయాలు నిలుపుదల చేయడంతో సంబంధిత వినియోగదారులు కూడా ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్‌పీసీఎల్, ఐఓసీ, బీపీసీఎల్ రిటైల్ అవుట్ లెట్లపై ప్రభావం పడడంతో కొరత ఏర్పడిందన్నారు.జిల్లాలో ఉన్న అన్ని బంక్‌లలో అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టాలని సూచించారు.రిలయన్స్, ఎస్సార్ సంస్థలు మొత్తం మార్కెట్లో 20 శాతం అమ్మకాలలో తమ వాటా కలిగి ఉన్నదని విక్రయాలు నిలిపివేయడంతో ఆ వినియోగదారులు కూడా ప్రభుత్వరంగ సంస్థల అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయడం వలన కొంత కొరత ఏర్పడిందని, అలాగే ఇప్పుడు ఎలాంటి సమస్య రాకుండా అధిక మించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా తూనికలు, కొలతల అధికారి వెంకటేశ్వర్లు, సేల్స్ అధికారులు మోహన్‌కృష్ణ, మధుసూదన్, బంకు డీలర్లు, డీటీలు తదితరులు పాల్గొన్నారు.