Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేములపల్లి
రైతాంగాన్ని ఆదుకోవడానికి స్వామినాథన్ సిఫార్సు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు.మంగళవారం మండలకేంద్రంలోని తహసీిల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. పెట్రోల్ ,డీజిల్ ,ఎరువులు, పురుగు మందుల ధరలుపెరగడంతొ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా మద్దతుధర అందక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఋణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు.రైతులు పండించిన పంటకు ధర నిర్ణయించె అదికారం లేదని అన్నారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వన్ టైం సెటిల్మెంట్ ద్వారా లక్ష రూపాయల ఋణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ పాదూరి గోవర్ధన శశిధర్‌రెడ్డి, రైతుసంఘం జిల్లా నాయకులు పాల్వాయి రాంరెడ్డి, రామారావు, కోడిరెక్క వెంకన్న, భిక్షం, పాపిరెడ్డి, ప్రణీత్‌రెడ్డి, సైదులు, ఎల్లయ్య పాల్గొన్నారు.
కౌలురైతులకు గుర్తింపు కార్డులివ్వాలి
తుంగతుర్తి :రాష్ట్రంలో ఉన్న కౌలురైతులకు గుర్తింపు కార్డు ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లా సుదర్శన్ డిమాండ్ చేశారు.మంగళవారం తెలంగాణ రైతు సంఘం పిలుపు మేరకు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి, అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రాంప్రసాద్ కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కౌలురైతులందరికీ ీ గుర్తింపు కార్డులు ఇచ్చి రైతులకు వర్తించే రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింపజేయాలన్నారు.కౌలుకు తీసుకున్న రైతులు సాగు చేసే క్రమంలో దిగుబడి రాక ,గిట్టుబాటు ధరలు లేక అకాల వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.స్వామినాథన్ కమిషన్ సూచించిన విధంగా ఉత్పత్తిధర కల్పించాలని డిమాండ్ చేశారు.కౌలు రైతులకు బేషరతుగా రుణాలు బ్యాంకులలో పెంచాలని కోరారు.మూడేండ్లకోసారి రెన్యువల్ కౌలుపత్రం రాయించాలన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బుర్రశ్రీనివాస్,తాటి విజయమ్మ, ఓరుగంటి అంతయ్య, గడ్డంఎల్లయ్య, దేవరాజు,బోనాలవెంకన్న, ముత్తయ్య, సోమయ్య, సావిత్రి పాల్గొన్నారు.