Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నెస్పీ సీపీఈ కన్సల్టెన్సీ బృందం సందర్శన
నవతెలంగాణ-సూర్యాపేట
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పధకం అమత్ 2.0 క్రింద పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రయినేజీ నిర్మాణానికి రూ.345 కోట్లు పట్టణంలో విలీన గ్రామాలలో నీటి సరఫరా నిర్వహణకుగాను రూ.45 కోట్లు మంజూరయ్యాయి.ఈ పనులకు సంబంధించి డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ సమర్పించుటకు ఎన్నెస్పీ సీపీఈ కన్సల్టెన్సీ బృందం మంగళవారం సూర్యాపేటను సందర్శించారు.బందం మున్సిపల్ కార్యాలయంలో ఛైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ,అధికారులతో సమావేశమై అమత్ 2.0 కింద చేపట్టే పనులను వివరించారు.అనంతరం పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే ఇమాంపేట ,చందుపట్ల మిషన్‌భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాట్‌ను సందర్శించి పట్టణానికి నీటిని సరఫరా చేయు వివరాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి,పబ్లిక్‌హెల్త్ ఈఈ గిలకత్తుల సత్యనారాయణ,మిషన్ భగీరథ ఈఈ వెంకటేశ్వర్లు, ఎన్నెస్పీఈఎండీ సుభాని, మున్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ పుట్టకిశోర్, మున్సిపల్ ఈఈ జీకేడీ ప్రసాద్, పబ్లిక్ హెల్త్ డీఈ రమాదేవి,ఏఈ నరేందర్, ఎస్ఎస్ఆర్.ప్రసాద్ పాల్గొన్నారు.