Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తుంగతుర్తి
పల్లె ప్రగతిని ఒక కార్యక్రమంగా కాకుండా, ఒక జీవన విధానంగా చూడాలని ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్ అన్నారు. గురువారం మండల పరిధిలోని గానుగుబండ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా చేస్తున్న పలు అభివద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సహకారంతో శ్రమదానం ద్వారా, పిచ్చి మొక్కలు తొలగించి, పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటాలన్నారు. అనంతరం గ్రామంలోని క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు .ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నల్లు రాంచంద్రారెడ్డి ,పంచాయతీ కార్యదర్శి కష్ణ గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.