Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్పర్సన్ అర్చన ,ఆమె భర్త రవి
- అక్రమాలపై విచారణ జరపాలి
నవ తెలంగాణ -హుజూర్ నగర్
హుజూర్ నగర్ ర్ మనసి పాలిటి చైర్మన్ అర్చన ,ఆమె భర్త రవిఅక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కస్తాలశ్రావణ్ కౌన్సిలర్లు కోతిసంపత్ రెడ్డి జక్కుల వీరయ్య అన్నారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు .మున్సిపల్ చైర్మన్ భర్త రవి కమిషనర్ ఆర్ ఐ పై ఒత్తిడి తెచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారని అంతే కాకుండా వారి లాగిన్ పాస్వర్డ్ దొంగిలించి వారికి తెలియకుండా ఇంటి నెంబర్ ఇస్తున్నారని ఆరోపించారు. సాయిబాబా టాకీస్ వద్ద ఐదువేల ఐదు వందల గజాల భూమి పద్మశాలి భవన్ వద్ద 4000 వేల 500గజాల భూమి సంబంధించిన అగ్రిమెంట్లు మున్సిపల్ కార్యాలయం నుండి దొంగిలించబడి నట్లు తెలిపారు .ఇటీవల ఎం జి ఓ ఓ కాలనీలో రామ మల్లు పటేల్ గారు పట్టాదారు భూమికి దొంగ నెంబర్ మరియు సబ్ నెంబర్లు కేటాయించారని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త రవి మున్సిపల్ కార్యాలయంలోపెత్తనం చేస్తున్నారని ఆరోపించారు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి ఆరోపణలను విచారణ చేయాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు, ఈ సమావేశంలో కౌన్సిలర్ వెలిదండ సరిత, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి తన్నీరు మల్లికార్జున్ నాయకులు జక్కుల మల్లయ్య నాగేశ్వరరావు ఏం సత్యనారాయణ గల్ల వెంకటేశ్వర్లువేముల నాగరాజు జ్ఞానయ్య కె జగన్ సులువా చంద్రశేఖర్ అంజి తదితరులు పాల్గొన్నారు
చైర్మన్ అర్చన వివరణ
మున్సిపల్ చైర్మన్ అర్చన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది కౌన్సిలర్లు నాయకులు కావాలనే ఆరోపణలు చేస్తున్నారని వాటిలో నిజం లేదన్నారు.