Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడ్డిపల్లి అరవిందో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త,హెడ్ ఇన్చారి లవకుమార్
నవతెలంగాణ -కోదాడరూరల్
రసాయన ఎరువుల పై ఖర్చు తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలి అని గడ్డిపల్లి అరవిందో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, హెడ్ ఇంచార్జి బి లవకుమార్ ,మత్తికా శాస్త్ర వేత్త ఏ కిరణ్ లు అన్నారు. గురువారం కోదాడ మండలంలోని గణపవరంలో వానాకాలం పంటల సాగు యాజమాన్య పద్ధతులపై మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వరి సాగులో విత్తనాలు వెదజల్లే పద్ధతి తో తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులు వస్తాయని అన్నారు.సస్యరక్షణ శాస్త్రవేత్త డి.ఆదర్శ ,వ్యవసాయ సహాయ సంచాలకులు తంగెళ్ల వాసు ,మండల వ్యవసాయ అధికారినీ రజిని, విస్తరణ అధికారి మహేష్, గ్రామ సర్పంచ్ పి.శ్రీ విజయ కిరణ్ కుమార్, ఆత్మ చైర్మన్ పి. సత్యనారయణ, రైతు బంధు సమితి గ్రామ కో ఆర్డినేటర్ పి వెంకేటశ్వర్లు, రైతులు కత్తి వెంకటేశ్వర రావు, కే నర్సింహ రావు, వెంకటరెడ్డి, పి రమేష్ బాబు, సీతారాం రెడ్డి, పి ప్రసాద్, కే చెన్నయ్య, పాల్గొన్నారు.