Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి ,ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
- కృష్ణా జలాల సమస్య పరిష్కరించండి మహాప్రభు
నవతెలంగాణ -నార్కట్పల్లి
దేశంలో ఏ ప్రభుత్వాలు చెయ్యని విధంగా గ్రామాలకు నేరుగా నిధులిస్తున్న ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని జెడ్పి చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి నకిరేకల్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. గురువారం చిన్నతుమ్మలగూడెం. గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు.అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో కొత్త శోభ సంతరించుకుందని అన్నారు. గ్రామాన్ని పారిశుధ్యంగా ఉంచుకోవడం మనందరి భాద్యతని, ప్రభుత్వం సమకూర్చిన నిధులను భాద్యతగా ఖర్చు చెయ్యాలని అన్నారు. వచ్చే నెలలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని తెలిపారు, అన్నివర్గాల ప్రజల బాగోగులను ఇంటి పెద్దలా కాపాడుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరెందర్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ దాసరి రాజు , ఎంపీటీసీ భాగ్యమ్మ మండల పరిషత్ అభివద్ధి అధికారి గుండ గొని యాదగిరి గౌడ్ , పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ పాల మోహన్, ఆ గ్రామ ప్రత్యేక అధికారి అర్ .బ్ల్యూ .ఎస్ ఇంజనీర్ అరుణ్ కుమార్,,చెర్వుగట్టు ఎంపీటీసీ మేకల రాజి రెడ్డి ,నార్కెట్పల్లి ఎంపీటీసీి పుల్లెంల ముత్తయ్య చిన్న తుమ్మలగూడెం మాజి సర్పంచ్ రాంరెడ్డి ,ఉప సర్పంచ్ అరుణ మాజి ఎం పి టి సి కష్ణయ్య ,మండల రైతు విభాగం కార్యదర్శి బత్తిని రమేష్ ,,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కష్ణా జలాల సమస్య పరిష్కరించండి మహాప్రభు.
గ్రామంలో వీటి సమస్య తీవ్రంగా ఉందని కష్ణా జలాలు రావడంలేదని గ్రామస్తులు గ్రామంలో తిరుగుతున్న జెడ్పీచైర్మెన్ బండా నరేందర్ రెడ్డి , ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గ్రామస్తులు పెట్టుకున్నారు. గత మూడేళ్లుగా కొత్త పింఛన్లు రావడం లేదని గ్రామంలో ఇంకా నాకు ఎందుకు రావాలని వారు కోరారు దీనిపై స్పందిస్తూ కష్ణా జలాలు గ్రామంలో సరఫరా అయ్యే విధంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరో 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ అరుణ్ కుమార్ కు ఆదేశించారు వచ్చే నెలలో కొత్త పింఛన్లు మంజూరు అవుతాయని దరఖాస్తు చేసుకున్న వారికి వస్తాయని గ్రామస్తుల కు నచ్చ చెప్పారు .