Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరిత హరితహారం కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం జిల్లా అధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ శాఖలకు కేటాయించిన టార్గెట్ ను పూర్తి చేయాలని కోరారు. టార్గెట్ ను పూర్తి చేయడం కోసం ముందుగానే అనువైన ప్రదేశాన్ని మొక్కలు నాటేందుకు ఉపయోగించుకోవాలని వర్షాకాలం ప్రారంభమైన మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని కోరారు. శాఖల వారీగా కేటాయించిన దానికంటే ఎక్కువ మొక్కలు నాటాలని, నాటడం తోనే మన పని అయిపోదని, వాటికి నీరు సంరక్షణ కల్పించాలని అధికారులకు సూచించారు. డీఆర్డీఏ పీడీ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ మండలం గ్రామాల వారీగా ప్రణాళికలతో తయారుచేసినట్లు వచ్చే వారం నుంచి మొక్కలు నాటిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. అటవీ శాఖ జిల్లా, డీపీఓ , డీఆర్డీఓ, ఆర్ అండ్ బి, వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ ఎక్సైజ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ విద్యాశాఖ పరిశ్రమల శాఖ మున్సిపల్ కమిషనర్ లతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ కుమార్, జిల్లా అటవీశాఖాధికారి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సునంద, రోడ్డు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శంకరయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.