Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -పెద్దవూర
అప్పుల బాధతాళలేక గిరిజన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దవూర మండలంలోని పాల్తీతండాలో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.పచ్చిపాల పరమేశ్ తెలిపిన వివరాల ప్రకారం...పాల్తీ తండాకు చెందిన పాల్తీ సుబ్బా(51) కు ఇద్దరు కుమారులు ,ఒక కుమార్తె కాగా ముగ్గురికి వివాహం చేశాడు. మూడేళ్లుగా ఐదు ఎకరాల్లో పత్తి,సాగుచేస్తున్నాడు. ఈక్రమంలో అప్పులు రూ.5 లక్షల వరుకు అప్పులయ్యాయి. అప్పులుతీర్చలేక,ఖరీఫ్ సాగుకు పెట్టుబడులు లేక, చేసిన అప్పులను తీర్చలేక మనస్థాపంతో పంట పొలంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సుబ్బా చిన్న కుమారుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జున సాగర్ కమలా నెహ్రు ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.