Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున
నవతెలంగాణ -మునుగోడు
అర్హత ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళిత బందు ఇవ్వాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, జిల్లా ఉపాధ్యక్షులు బొట్టు శివ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తామని పూర్తి గా విఫలం అయ్యారని విమర్శించారు. దళిత బందు నియోజకవర్గానికి వంద మంది,పదిహేను వందల మందికి కాకుండా మండలానికి వెయ్యి మంది లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. శాసనసభ్యులు,మంత్రులకు కాకుండా జిల్లా కలెక్టరు లకు సంబందిత అధికార యంత్రాంగానికి లబ్ధిదారులను ఎంపిక చేసేవిధంగా చేసి పారదర్శకంగా ఉండాలని కోరారు. గ్రామాలలోని డబుల్ బెడ్ రూం ఇళ్లు వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేసి వ్యక్తిగత దరఖాస్తులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఓంటేపాక అయోధ్య, కందుల అశోక్, సూరారం యాదమ్మ, భీమనపల్లి నరసింహ, జీడిమెట్ల సైదులు, ఎర్ర పార్వతమ్మ, ఎర్ర అరుణ, పెద్ద మామిడి సుజాత, అశోక్, తదితరులు పాల్గొన్నారు.