Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ విధానాలను వ్యతిరేకించే ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని పోటీలో నిలపాలి
- ఆయా రాష్ట్రాలలో ఫ్రంటు, ఐక్య సంఘటన ఏర్పడాలి
- ప్రజా సమస్యలను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న కెేసీఆర్
- ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- సూర్యాపేటటౌన్
దేశవ్యాప్తంగా బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరుస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను,తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలను పదే పదే విమర్శలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తటస్థ వైఖరి అవలంబించడమంటే బీజేపీకి లాభం చేకూర్చడమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎస్పి ఆఫీస్ సమీపంలోగల శ్రీ విగేశ్వర ఫంక్షన్ హాల్లో జరుగుతున్న ఆ పార్టీజిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పతి ఎన్నిక విషయంలో బీజేపీకి వ్యతిరేక అభ్యర్థిని పెట్టడం కోసం దేశ స్థాయిలో వస్తున్న జరుగుతున్న ప్రయత్నాలు,స్పందన బాగున్నాదని అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ అనుసరిస్తున్న పరిస్థితి చూస్తుంటే బీజేపీ విషయంలో టీఆర్ఎస్ను శంకించాల్సి వస్తుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీఅభ్యర్థి నివారించడం కోసం దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా పనిచేయడం కోసం అన్ని పార్టీలు కషి చేయాలే తప్ప పార్టీల మధ్య ఉన్న సమస్యలను సాకుగా తీసుకొని బీజేపీకి లాభం చేకూర్చే విధంగా ఉండొద్దనే అభిప్రాయం వ్యక్తం చేశారు.రాష్ట్రపతి ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా దేశవ్యాప్తంగా వ్యక్తిగతంగా మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉండి బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ బిజెపికి వ్యతిరేకంగా పోరాడే వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అఖిల భారత స్థాయిలో పార్టీని ఏర్పాటు చేయిస్తామని ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి దేశ స్థాయిలో ప్రాంతీయ పార్టీలతో కూటమి పెట్టి బిజెపిని ఓడిస్తామని చెప్పే విధానం సరికాదన్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఫ్రంట్ ఏర్పాటు చేయడం మూలంగా ప్రాక్టికల్ గా ఎలాంటి ఉపయోగం ఉండదని అనుభవాలు తెలుపుతున్నాయన్నారు. ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలలో బిజెపి వ్యతిరేక ఓట్లు చీలకుండా కూటమి ఏర్పాటు చేయాలని,ఆ విధంగా గెలిచిన సీట్ల మధ్య ఐక్య సంఘటన నిర్మించాలని అప్పుడు మాత్రమే బీజేపీని నిలువరించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.రాష్ట్రపతి ఎన్నిక, ఆలిండియా రాజకీయాల మాటున రాష్ట్రంలోని తీవ్రమైన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.పోడు భూముల సమస్యలు పట్టించుకోకుండా,పట్టాలు ఇవ్వకుండా,సాగు చేసుకోడానికి అవకాశం లేకుండా చేస్తుందన్నారు. వరంగల్లు,హనుమకొండ జిల్లాలలో పేదల ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తుంటే నిర్బంధాలు ప్రయోగించి ఉద్యమాన్ని అణచివేయాలని చూడటాన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుదన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై స్థానికంగా ప్రజలను కూడగట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధతం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు,కొలిశెట్టి యాదగిరిరావు,ధీరవత్ రవి నాయక్,బుర్రి శ్రీరాములు,కోట గోపి, ఎలుగురి గోవింద్, మేకనబోయిన శేఖర్ జె. నరసింహారావు,ఎం. వెంకటేశ్వరరావు,యాకలక్ష్మి,మేకనబోయిన సైదమ్మ,కొప్పుల రజిత,ఎలుగురి జ్యోతి, పులుసు సత్యం,చినపంగి నర్సయ్య,దనియాకుల శ్రీకాంత్ నాగారపు పాండు,పల్లా వెంకటరెడ్డి, ముత్యాలు, వత్తేపు సైదులు,బెల్లంకొండ వెంకటేశ్వర్లు,బెల్లంకొండ సత్యనారాయణ,నాయకులు ములకలపల్లి రాములు, చంద్రయ్య, కుమార్,శ్రీనివాస్, సాయికుమార్,సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.