Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలడుగు ప్రభావతి ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి
నవతెలంగాణ- నల్లగొండ
ఇంటి పని వారిని కార్మికులుగా గుర్తించి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా లేబర్ అధికారికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత 2011 లో అంతర్జాతీయ గహ కార్మికుల రక్షణ కోసం ఐఎల్ఓ కన్వెన్షన్ సీ189/చట్టం ఆమోదించిందన్నారు. అప్పటి నుండి ప్రపంచ వ్యాపితంగా అనేక దేశాలు ఇంటి పని వాళ్లకు రక్షణ మెరుగుపరచాలని కషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఇంటిపని చేసే మహిళల పరిస్థితి మారలేదన్నారు. ఆర్థికంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలలో ఇంటి పని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి కొండా అనురాధ, జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి, జ్యోతి తరులు పాల్గొన్నారు.