Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంక్ యాజమానులకు అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్ హెచ్చరిక
నవతెలంగాణ- నల్లగొండ
జిల్లాలో డీజిల్ కృత్రిమ కొరత సృష్టిస్తే,బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్ హెచ్చరించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం అదనపు కలెక్టర్ చాంబర్లో పౌర సరపరాల డి.టి.లు పెట్రోల్. బంక్ డీలర్లు,సేల్స్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బంక్ లలో డీజిల్ కొరత నేపథ్యం లో వినియోగదారుల కు డీజిల్ సరపరా లో ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.డీజిల్ కొరత పై బంక్ ల వారీగా తహసీల్దార్ లు,పౌర సరపరాల డీటీలు పర్యవేక్షణ చేయాలని ,తగు చర్యలు తీసు కుంటారని అన్నారు. డీలర్లు కోటా ప్రకారం సేల్స్ ఆఫీసర్ ద్వారా సరఫరా తెప్పించు కోవాలని,సేల్స్ అధికారులు డీలర్లు ఇచ్చిన ఇండెంట్ ప్రకారం డీజిల్ ఆయిల్ కంపెనీల నుండి సరపరా చేయాలని కోరారు. ఎమర్జెన్సీ సర్వీస్ లకు కొరత లేకుండా చూడాలని, కొన్ని బంక్ లలో సరఫరా కొరత మూసి వేసిన బంక్ లు వెంటనే తెరచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగ దారులు ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.