Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలిమినేటి సందీప్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జెడ్పీచైర్మన్
- చౌటుప్పల్ మండలం ఆరెగూడెం,నేలపట్లలో ఆకస్మిక తనిఖి
- పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం చేయొద్దని సర్పంచ్, అధికారులకు హితువు
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని యాదాద్రి భువనగిరి జెడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలంలో పల్లె ప్రగతిలో వెనుకబడిన ఆరెగూడెం,నేలపట్ల గ్రామాల్లో గురువారం పల్లెప్రగతి పనులను ఆకస్మిక తనిఖీ చేశారు.ఆరెగూడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో చౌటుప్పల్ ఎంపిడివో, ఎంపీఓ, ఎపిఓ లతో గ్రామాల్లో జరుగుతున్న పనుల గురించి సమీక్ష చేశారు. గ్రామంలో ప్రజలను అభివద్ధి జరుగుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో అభివద్ధి పనులు జరగడం లేదని గ్రామస్తులు సందీప్ రెడ్డి దష్టికి తీసుకెళ్లారు. గ్రామ సర్పంచ్ పని తీరుపై అసంతప్తి వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది తగినంత ఉన్న కూడా పారిశుద్ధ్య పనులు సంతప్తికరంగా లేదని అన్నారు.అనంతరం గ్రామంలోని వైకుంఠధామం,క్రీడా స్థలం, డంపింగ్యార్డు, నర్సరీ, పల్లెప్రకతి వనం, హరితహారం మొక్కలను పరిశీలించారు. గ్రామాలను అన్ని రంగాల్లో అభివద్ధి చేసేందుకే ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. నేలపట్ల గ్రామ ఎంపీటీసీ తడక పారిజాత మోహన్ నేలపట్ల-వర్కట్ పల్లి రోడ్డు వేయాలని వినతిపత్రం అందజేశారు. ఆయన ఎంపీడీఓ యాదగిరి,ఎంపిఓ అంజిరెడ్డి, ఎపిఓ ఈశ్వరయ్య లు ఉన్నారు.ఈ కార్యక్రమంలో నేలపట్ల సర్పంచ్ చౌట వేణు,పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్,మాజీ సర్పంచి జాల మల్లేష్,వార్డు సభ్యులు ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.