Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-కోదాడరూరల్
అధికారులు అలసత్వం వీడి మండలంలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివద్ది పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వినరుకష్ణారెడ్డి ఆదేశించారు.శుక్రవారం ఆయన తహసీల్దార్ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో అభివద్ధి పనులు, హరితహారం, క్రీడాప్రాంగణాలు ఏర్పాటుపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు.గ్రామంలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలో ఎన్ఎస్పీ కాలువ వెంట వున్న భూములలో హరిత హారం కింద మొక్కలు నాటాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో కూడా హరితహారం కింద విరివిగా మొక్కలు నాటాలని, అందుకు తగినట్లే ప్రణాళికలు రూపొందించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.కాగా మండలపరిధిలో ఇప్పటివరకు చేపట్టిన హరితహారం మొక్కలు లేకపోవడంపై ఆయన ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలసంరక్షణపై నిర్లక్ష్యం తనిఖీ చేశారు.రేట్ల పట్టిక పెద్దగా ప్రదర్శించాలని, అధిక రుసుము వసూళ్లు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కిశోర్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్‌శర్మ, ఎంపీడీవో విజయశ్రీ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, ఎంపీఓ పాండురంగన్నయాదవ్, ఏపీఎం వీరబాబు పాల్గొన్నారు.