Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
సైనిక నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపత్ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ డిమాండ్ చేశారు.పథకం రద్దు కోరుతూ శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి మాట్లాడారు. సైనికరంగంలో కాంట్రాక్ట్ పద్ధతి వల్ల రక్షణ పరమైన సమస్యలు వస్తాయన్నారు.అగ్నిపత్ రద్దు చేసి గత పద్దతిలో నియామకాలు చేపట్టాలన్నారు.ఆర్ఆర్బీ పరీక్ష నిర్వహించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యువతపై లాఠీచార్జి చేసి కాల్పులు చేయడం దారుణమన్నారు.పోలీస్ కాల్పులో చనిపోయిన వారికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.ఈకార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, ఎండి.అంజద్, తిరుపతి రామ్మూర్తి, రెమిడాల పరుశరామ్, గాదె పద్మమ్మ, సైదులు, బాబూనాయక్, నాగేందర్, సైదానాయక్,జగన్, భిక్షం, వదూద్ తదితరులు పాల్గొన్నారు.
మునగాల : అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దేవరం వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే ధర్నా కార్యక్రమానికి తరలివెళ్లారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు.హైదరాబాద్ వెళ్ళిన వారిలో దుగ్గి బ్రహ్మం, వేల్పుల వెంకన్న, పాండునాయక్, బాలునాయక్ ఉన్నారు.
యువకులపై కాల్పులు జరపడం దుర్మార్గం
సూర్యాపేటటౌన్ :దేశ అంతర్గత భద్రతను తాకట్టు పెట్టే విధంగా సైనికులను నియమించడం కోసం కాంట్రాక్టు పద్ధతిని ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ సికింద్రాబాదులో నిరసన తెలుపుతున్న నిరుద్యోగ యువకులపై పోలీసులు కాల్పులు జరపడం దుర్మార్గమని,పోలీస్ కాల్పుల్లో మరణించిన యువకుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి డిమాండ్ చేశారు.సికింద్రాబాదులో నిరుద్యోగ యువకులపై జరిగిన కాల్పులకు నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని సైనిక్‌పురి కాలనీలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని రక్షించడం కోసం సైనికరంగంలో చేరి దేశానికి సేవ చేయాలని తపన పడుతున్న నిరుద్యోగ యువకులకు నిరాశ మిగిలే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.ఎన్నో ఆశలతో సైన్యంలో చేరాలనుకున్న యువకుల ఆశలను వమ్ము చేసే విధంగా కేంద్రం వ్యవహరించడం సరి కాదన్నారు.నిన్నటివరకు కిసాన్లను ఇబ్బందిపెట్టిన ప్రభుత్వం నేడు జవాన్ల జీవితాలతో ఆట ఆడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని పాతరేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తుం దన్నారు.కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను నియమిస్తే దేశంలో ఉగ్రవాద దాడులు, విచ్చిన్నకర శక్తుల ఆగడాలు పెరిగే ప్రమాదం ఉందని విమర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం గల భారతదేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల,మత ప్రాంతాల పేరుతో దాడులు దౌర్జన్యాలు చేస్తూ దేశాన్ని సర్వ నాశనం చేయాలని చూస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ఎలుగూరి గోవింద్, కోట గోపి, మేకనబోయిన శేఖర్,పులుసు సత్యం, బూర శ్రీనివాస్, సుదర్శన్,వజ్జె శ్రీనివాస్, రణపంగ కష్ణ,ఉప్పలయ్య, లక్ష్మీ,పిండిగ నాగమణి, మామిడి సుందరయ్య, నగేష్,అబ్బగాని భిక్షం, బోళ్ళ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.