Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సమస్యలపై కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
జిల్లావ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై,ప్రజలను సమీకరించి పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.జిల్లాకేంద్రంలోని విఘ్నేశ్వర ఫంక్షన్హాల్లో జరుగుతున్న పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణా తరగతుల్లో భాగంగా రెండవ రోజు పార్టీ,ప్రజాసంఘాల నిర్మాణంపై ఆయన తరగతులు బోధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యలను దష్టిలో ఉంచుకొని వాటిని తీర్చగలిగేలా పార్టీ నిర్మాణం చేపడుతుందని స్పష్టం చేశారు.దేశ రాజకీయాల్లో కొన్ని పార్టీలు ప్రజా సమస్యలను పూర్తిగా అంచనా వేయడంలో పాలనలో వైఫల్యం చెందాయని వెల్లడించారు.భౌతికంగా, సామాజికంగా,రాజకీయ అంశాలను అవగతం చేసుకొని ముందుకు వెళ్తున్న ఏకైక పార్టీగా సీపీఐ(ఎం) దూసుకెళ్తుందని స్పష్టం చేశారు.పార్టీపైన కార్యకర్తలకు అచెంచలమైన విశ్వాసం ఉండాలని,అందుకు జాతీయ నాయకత్వం 1967లో నూతన అద్యయనాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.జిల్లావ్యాప్తంగా ప్రజలు ఇండ్లు, స్థలాలు, రేషన్‌కార్డులు,పెన్షన్లు అందక ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండడంతో రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని డిమాండ్ చేశారు.జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా మొదటివారంలో ఆసరా పెన్షన్లు అందించాల్సి ఉండగా నెల చివరివారంలో కూడా అందే పరిస్థితి లేదన్నారు.ధరణి వచ్చాక భూ సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న ప్రభుత్వం ఇవ్వకపోగా దళితబంధు పేరుతో వారిని మోసం చేస్తుందన్నారు.ఎస్సారెస్పీ కాలువ ద్వారా చివరి భూములకు నీళ్లు అందిస్తానే వ్యవసాయం సాగవుతుందన్నారు.ప్రజలు ఎదుర్కొంటున్నా సమస్యలపై పార్టీ, ప్రజా సంఘాల నాయకులు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకొని పోరాటాలకు ప్రజలను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, రవి నాయక్,ఎల్గూరి గోవిందు,కోటగోపి, నాగారం పాండు, మేకనబోయినశేఖర్, సైదమ్మ, జ్యోతి,రజిత,పల్లా వెంకటరెడ్డి, వెంకటేశ్వరరావు, ముత్యాలు, సైదులు, సుందరయ్య,బత్తుల వెంకన్న,రణపంగ కష్ణ, లింగయ్య,సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.