Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు మరమ్మతులకు నిధులు కేటాయించడం లేదంటూ నిరసన
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
మండల కేంద్రం నుండి తమ గ్రామానికి వెళ్లే మెయిన్ రోడ్డు గుంతలు పడి ప్రమాదాలు జరిగిఇబ్బందులు పడుతున్న స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులు పట్టించుకోకపోవడంతో మండలంలోని పెద్ద కందుకూరు సర్పంచ్ భీమగాని రాములు శుక్రవారం పట్టణంలో భిక్షాటన చేస్తూ ప్రభుత్వంపై తన నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ తాను ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తిని అయినందున స్థానిక ఎమ్మెల్యే కక్షపూరితంగా వ్యవహరిస్తుంద న్నారు.గత మూడు సంవత్సరాల నుండి పెద్ద కందుకూరు నుండి యాదగిరిగుట్ట వెళ్లే రోడ్డు మొత్తం గుంతల ఏర్పడి పోకుండా అయిందని ఈ విషయమై పలు సార్లు ఎంపీ ఎమ్మెల్యే అధికారులకు తెలియజేసిన ఫలితం లేదన్నారు.దీంతో పంచాయతీ నిధుల నుండి పనిచేయాలని 12 లక్షలు తీర్మానం చేసిన అధికారులు సహకరించకుండా పనులను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అందుకే రోడ్డు నిర్మాణం కోసం భిక్షాటన చేసి దాతల సహకారంతో మరమ్మతులు చేసేందుకే ముందుకు కదిలాను అన్నారు .ఇప్పటికైనా రోడ్డు నిర్మాణానికి అధికారులు నిధులు విడుదల చేయాలని లేని పక్షంలో గ్రామపంచాయతీ నిధులు వాడుకోవటానికి అనుమతించాలని ఆయన వేడుకున్నారు.