Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కోదాడ పీఏసీఎస్పరిధిలోని గణపవరం, కూచిపూడి, తొగర్రాయి, తమ్మరబండపాలెం గ్రామాల్లో రైతుల సౌకర్యార్థం టెస్కాబ్ నిధులతో నిర్మిస్తున్న గోదాములను చైర్మెన్ ఆవుల రామారావుతో కలిసి టెస్కాబ్ అధికారులు గురువారం పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా చైర్మెన్ ఆవుల రామారావు అధికారులకు గోదాం నిర్మాణపనులు జరుగుతున్న తీరును వారికి వివరించారు. పనులు తుదిదశకు చేరుకున్నాయని త్వరలోనే గౌరవ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ చేతులమీదుగా ప్రారంభానికి సిద్ధంగా ఉంచామని అధికారులకు వివరించారు.అధికారులు గోదాం నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, టెక్నీషియన్లకు పలు సలహాలు, సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో టెస్కాబ్ ఏజీఎం మణికాంత్, ఏఈ చంద్ర శేఖర్,డీసీసీబీ మేనేజర్ సుగుణకుమార్, కోదాడ బ్రాంచి మేనేజర్ సుధాకర్, సూపర్వైజరు వెంకటనారాయణ, రఫీ, కోదాడ పీఏసీఎస్ సీఈఓ మంద వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.