Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
రాష్ట్రంలోని బాసర విద్యాలయం లోని విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆ పార్టీ మండలశాఖ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు నిరసన వ్యక్తంచేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కత్తుల పరమేశ్, మస్కు నర్సింహా, ఏర్పుల అర్జున్, కత్తుల పద్మ, గాదె సంతోష, కత్తుల నర్సింహా, చుక్క ప్రమీల, శివ, సతీశ్ పాల్గొన్నారు.