Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కరరావుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు అయ్యూబ్, సీనియర్ జర్నలిస్టు ఖాజా హామీదోద్దీన్, వెంకన్న, మహేష్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఆయా మండలకేంద్రాలలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఎన్నో ఏండ్లుగా జర్నలిస్టు వత్తిలో పనిచేస్తూ అద్దె ఇంట్లో కిరాయికి ఉంటూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.మండల,పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూమిని జర్నలిస్టులకు ప్లాట్లుగా కేటాయించాలని డిమాండ్ చేశారు.అక్రిడేషన్ కార్డుతో సంబంధం లేకుండా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.వెంటనే ప్రభుత్వ భూమిని గుర్తించి పంపిణీ చేయాలని సూచించారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యా సంవత్సరంలో జర్నలిస్టుల పిల్లలకు రాయితీ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.జర్నలిస్టుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.ఈ నెల 30తో అక్రిడేషన్ కార్డు గడువు పూర్తవుతుందని ఆలోపే కొత్త కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.వినతిపత్రం అందజేసిన వారిలో జర్నలిస్టులు ఖాజా హామీదోద్దీన్, ఖాజా నజీమోద్దీన్, యాదగిరి,మహేష్, రామకృష్ణ, మహేష్,మంద సైదులు, మట్టయ్య, జయరాజు, నాగరాజు, సురేష్ నాగేందర్,రమేష్, సతీష్ పాల్గొన్నారు.