Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన మహిళలతో కలిసి నత్యం చేసిన కలెక్టర్
నవతెలంగాణ -సంస్థాన్‌నారాయణపురం
జిల్లా కలెక్టర్ పమేలా సత్పపతి శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. శుక్రవారం ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం గ్రామంలో మహిళా ఆరోగ్యంపై అంగన్వాడి, ఆశ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అంగన్వాడి కేంద్రాలలో నిర్వహిస్తున్న ఆరోగ్య పోషణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం మహిళలతో మాట్లాడారు పిల్లలకు అన్నప్రాసన్న,అక్షరాభ్యాస కార్యక్రమాలు చేయించారు. అనంతరం వాచ్యతండా, కోర్ర తండాలో గిరి వికాసం పథకం కింద ఎస్టీలు వేసుకున్న సబ్సిడీ బోరుబావులను పరిశీలించారు. ఈ ప్రాంతంలో రైతులు పండించే పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. భూగర్భజలాల తీరును పరిశీలించారు. చిల్లాపురం, కోర్ర తండా గ్రామాల్లో ఏర్పాటుచేసిన వనం నర్సరీలను సందర్శించారు. గిరిజన మహిళలు సంప్రదాయ నత్యాలతో స్వాగతం పలికారు. గిరిజన మహిళలతో కలిసి కొర్ర తండాలో నత్యం చేశారు. భూగర్భ జలాల పెంపు కోసం కొర్ర తండా లో వాటర్ షెడ్ పథకం కింద నిర్మిస్తున్న నీటి కుంట పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి,ఎంపీపీ ఉమా, డీఆర్డీఏ పీడీ ఉపేందర్ రెడ్డి, మాన్య నాయక్, ఏపీఎం జి.యాదయ్య, ఏపఓ ప్రశాంతి,సర్పంచులు, అధికారులు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.