Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ -నల్లగొండకలెక్టరేట్
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లా రెడ్డి గూడ గ్రామంలో రాజీవ్ స్వగహ శ్రీ వల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు భౌతిక వేలం ఈ నెల20 నుండి 26 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వెల్లడించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉదయాదిత్య భవన్లో రాజీవ్ స్వగహ శ్రీ వల్లి టౌన్ షిప్ లో ఓపెన్ ప్లాట్ లు,పాక్షిక నిర్మాణం చేసిన గహాల వేలం పై రెండవ విడత రెండవ ప్రీ బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓపెన్ ప్లాట్ లు 253, పాక్షిక నిర్మాణ గహాలు 363 భౌతిక వేలం నిర్వహించనున్నట్టు తెలిపారు. .ఓపెన్ ప్లాట్లకు చదరపు గజానికి 7 వేల రూపాయలు,పాక్షిక నిర్మాణం అయిన గహాలు నిర్మాణ దశలు అనుసరించి చదరపు గజంకు 7 వేల రూపాయల నుండి 12 వేల 500 రూపాయలు అప్ సెట్(కనిష్ట) ధర గా నిర్ణయించినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న అరుదైన అవకాశం అని,ఎటువంటి చిక్కులు లేని ఓపెన్ ప్లాట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేలంలో పాల్గొనే వారు రూ.10 వేలు ఈఎండీి కలెక్టర్ పేరున డీడీ చెల్లించి:దరఖాస్తుతో వేలంకు ఒక రోజు ముందు సమర్పించి టోకెన్ తీసుకొని వేలంలో పాల్గొనాలని తెలిపారు. కలెక్టర్ చాంబర్ వద్ద రాజీవ్ స్వగహ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా లే అవుట్ చేసిన ప్లాట్ లు ఎటువంటి సమస్యలు లేని వాటిని వేలం ద్వారా సొంతం చేసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం చేసిన ఈ లే అవుట్ లో బ్లాక్ టాప్ అంతర్గత రహదారులు, విద్యుత్ సరఫరా, విద్యుదీకరణ,స్ట్రీట్ లైట్ లు, మంచి నీటి సరఫరా , సీవ రేజ్, అవెన్యూ ప్లాంటేషన్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఓపెన్ ప్లాట్ల,గహాల వేలం ద్వారా విక్రయం పై సందేహాలను నివత్తి చేస్తూ కలెక్టర్ అవగాహన కలిగించారు. ఈ సమావేశంలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు,పౌర సరఫరాల డీఎం నాగేశ్వర్ రావు,రాజీవ్ స్వగహ కార్పొరేషన్ జీఎం షఫీ తదితరులు పాల్గొన్నారు.
మన ఊరు - మన బడి కార్యక్రమం పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
మన ఊరు - మన బడి కార్యక్రమం లో గుర్తించిన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనకు పనులు ప్రారంభించడం లో నిర్లక్ష్యం వహించే అధికారుల పై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరించారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉదయాదిత్య భవన్ లో మన ఊరు - మన బడి,మన బస్తీ - మన బడి కార్య క్రమం లో చేపట్టిన పనుల పై నియోజక వర్గ ప్రత్యేక అధికారులు,మండల ప్రత్యేక అధికారులు,ఎంపిడిఓలు,ఇంజనీరింగ్ శాఖల ఈ ఈ లు, ఏఈలతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి మండలం వారీ గా గుర్తించిన పాఠశాలల్లో పనుల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత లో 517 ప్రభుత్వ పాఠశాల లను ప్రభుత్వం ఎంపిక చేసినట్లు,132 పాఠశాలలకు నిధులు జమ చేసినట్లు వెల్లడించారు.నిధులు మంజూరు చేసిన పాఠశాలల్లో కూడా పనులు ఇంకా మొదలు పెట్ట లేదని,జిల్లా ప్రగతి రాష్ట్రంలో చిట్ట చివరగా వుందని అన్నారు.నిధులు విడుదల చేసిన పాఠశాలల్లో వెంటనే పనులు ప్రారంభించి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.నల్గొండ నియోజకవర్గం లో,మును గొడ్ నియోజక వర్గం లోని మండలంలలో పనులు ఇంత వరకు ప్రారంభించ లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. పనులు ప్రారంభించి మన ఊరు - మన బడి ఆప్ లో ఫోటో లు అప్ లోడ్ చేసి ఆన్ లైన్ లో ప్రగతి నమోదు చేయాలని సూచించారు.నియోజక వర్గ అధికారులు, ఎంపీడీఓ.లు,సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాఠశాలలను సందర్శించి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎంపీడీఓలు సర్పంచ్,పాఠశాల యాజమాన్య కమిటీ లతో సమావేశం జరిపి పనులు ప్రారభమయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి బిక్షపతి, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓ లు,నియోజక వర్గ ప్రత్యేక అధికారులు జగదీశ్వర్ రెడ్డి,గోపి రాం,నియోజక వర్గ ప్రత్యేక అధికారులు రాజ్ కుమార్,పుష్ప లత,పంచాయతీ రాజ్ ఈఈ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.