Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ మారిన ప్రజాప్రతినిధుల చేతులు నరికేయాలి
- నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి
నవతెలంగాణ -నకిరేకల్
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయలేని ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేస్తే ఏమొచ్చిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలో లక్ష్మీ నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు, ఎంపీ అరవింద్ తెలంగాణ రాష్ట్రంలో ధర్నా చేయడం ప్రజలను మభ్య పెట్టడమేనన్నారు. బిజెపి, టిఆర్ఎస్ రాజకీయ డ్రామాతో ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబ సభ్యులను ఈడీ పేరుతో వేధిస్తుందన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో వందల కోట్ల రూపాయలు దోచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వదిలేసారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజల కోసం ప్రధాన మంత్రి పదవి నీ వదిలేసిన గొప్ప నాయకులు సోనియా, రాహుల్ అని కొనియాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని అభివద్ధి చేస్తే పీకే తో పనేం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే కుమారుడు, హౌం శాఖ మంత్రి మనవడు లైంగికదాడికి పాల్పడితే ఇప్పటివరకు ఎందుకు స్పందించడం లేదో మంత్రి కేటీఆర్ చెప్పాలన్నారు. ఒక పార్టీ లో గెలిచి న ప్రజా ప్రతినిధులు ఆ పదవికి రాజీనామా చేయకుండా ఇతర పార్టీ మారితే పార్టీ మారిన ప్రజాప్రతినిధుల చేతులను నరికి వేయాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం పీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ పుట్టినరోజును పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మండల అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, నాయకులు పాల్గొన్నారు.