Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ
భారత ఆర్మీ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల పై జరిగిన కాల్పులను ఖండిస్తూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో నాలుగు సంవత్సరాలు కాంట్రాక్టు విధానాన్ని తీసుకొస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాలపై విద్యార్థులు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నిరసనకారులపై ప్రభుత్వం కాల్పులు జరపడం సిగ్గుచేటని అన్నారు. ఆర్మీ లో నాలుగు సంవత్సరాల కాంట్రాక్టు విధానాన్ని తీసుకురావడం సరి కాదని అన్నారు. దేశ రక్షణ కోసం సైనిక విభాగాల లో పని చేయడానికి సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే అగ్నిపథ్ స్కీమ్ ను రద్దు చేయాలని గతంలో మాదిరిగా యథావిధిగా ఆర్మీ సైనిక రిక్రూట్మెంట్ కొనసాగించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎండి సలీం, జిల్లా కమిటీ సభ్యులు దండం పల్లి సత్తయ్య ,తుమ్మల పద్మ ,పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ,పాక లింగయ్య, భూతం అరుణ కుమారి, గుండాల నరేష్, జక్కల రవికుమార్ అకిటి చంటి,పద్మ, పెరిక కష్ణ ఎగ్బాల్ సాజిద్, తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'అగ్నిపధ్' పథకాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై కాల్పులు జరపడం అమానుషం అని సీపీిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, కల్లూరి మల్లేశం విమర్శించారు. శుక్రవారం ఆపార్టీ ఆద్వర్యంలో సుభాష్ సెంటర్ లో మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడం మూలంగా వత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ఘటనలో అమరులైన నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటి సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, నాయకులు నాగటి ఉపేందర్, గాదె నరేందర్, బావండ్లపల్లి బాలరాజు, గన్నెబోయిన విజయభాస్కర్, కందుల హనుమంతు, జల్లల లక్ష్మమ్మ, మేడి ముకుందం, మెట్టు శ్రవణ్, జనపాల లక్ష్మణ్, గోగు లింగస్వామి, బైకాని నర్సింహ్మ,అచ్చాలు, గట్టు ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపత్ పథకాన్ని రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందాల ప్రమీల డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల ను నిరసిస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వము తెచ్చిన అగ్నిపత్ పథకాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతి విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కాల్పుల్లో మరణించిన వారికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం భద్రత కల్పించాలన్నారు. కాల్పుల్లో గాయపడిన వారికి రూ. 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, మండల కార్యదర్శి రాచకొండ వెంకన్న, టౌన్ కార్యదర్శి వంటే పాక వెంకటేశ్వర్లు, కేతపల్లి కార్యదర్శి మారయ్య, మాజీ ఎంపీపీ మరి వెంకటయ్య, నాయకులు వంట పాక కష్ణ, యానాల కష్ణ రెడ్డి, బి. ప్రకాష్ రావు, పుట్ట సత్తయ్య, ఏ సుదీర్, బి ఇందిర, ఆర్ ఇందిర, పీ శశికళ, బిక్షం రెడ్డి, ప్రవీణ్, జమదగ్ని పాల్గొన్నారు.