Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
ఈనెల 16న జెఎన్ స్టేడియం హన్మకొండలో నిర్వహించిన 1వ రాష్ట్ర స్థాయి పురుషుల, మహిళల, అండర్ -20,18,16, 14,12 ఏండ్లలోపు బాలబాలికల స్ప్రింట్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జిల్లాకేంద్రానికి చెందిన మరికొండ గణేష్ 12 ఏండ్లలోపు బాలుర 300 మీ. పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించాడని హనుమాన్ ట్రైనింగ్ సెంటర్ వ్యవస్థాపకులు,ు శిక్షకులు మాటూరి వినోద్, కోనేటి గోపాల్ శుక్రవారం తెలిపారు. విజయం సాధించిన గణేష్ ను శిక్షకులు కోనేటి గోపాల్ గారిని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పోతంశెట్టి వెంకటేశ్వర్లు , కోశాధికారి గోనురు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొల్ల వెంకటరమణ , యూసుఫ్, కబీరుద్దీన్, అనిల్, సునీల్, మహేష్, సాయి, పవన్, కౌశిక్, గురునాధ్, సాధు ఉపేందర్, ఉత్తేజ్, నర్సింహ, మల్లేష్, సతీష్ తదితరులు అభినందించారు.