Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీయూ వీసీ, ప్రొఫెసర్ సొల్లేటి గోపాల్ రెడ్డి
నవతెలంగాణ -నార్కట్‌పల్లి
ఎలక్ట్రానిక్ వేస్ట్‌తో ప్రమాదం పొంచి ఉందని ఎంజీయూ వీసీ, ప్రొఫెసర్ వి. సి.సొల్లేటి గోపాల్ రెడ్డి అన్నారు. శనివారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ పై సెమినార్ నిర్వహించారు. సెమినార్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో రోజుకొక నమో నాతో సెల్ఫోన్లు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వస్తున్నాయన్నారు. వాటివల్ల పాతవన్నీ నిరుపయోగంగా పడి పోయినవి గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయన్నారు. వీటివల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లడం కాకుండా నీటి వనరులు గాలి భూమిపై కాలుష్యాన్ని కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ పర్యావరణానికి ఏ రకమైనటువంటి భంగం కలగకుండా వాటిని తిరిగి ఉపయోగించుకొనే సాంకేతిక పరిజ్ఞానంపై ప్రతి ఒక్కరూ దష్టి పెట్టాలన్నారు. హైదరాబాద్ కు చెందిన సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సంస్థకు చెందిన సైంటిస్ట్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ సెంటర్ ఫర్ మెటీరియల్ ఫర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ నిర్వహిస్తూ ఉందని తద్వారా పర్యావరణానికి హాని కలగకుండా వినియోగించుకునే పద్ధతులను చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ సంస్థకు చెందిన సైంటిస్టులు డాక్టర్ మల్లేశ్వర రావు, డాక్టర్ కె. రామ స్వామి లు పవర్ పాయింట్ ద్వారా వివిధ రకాల అయినటువంటి ఎలక్ట్రానిక్ చెత్తను ఉపయోగించే పద్ధతులను తెలిపారు.ఐ క్యు ఏసీ డైరెక్టర్ డాక్టర్ పీకే శ్రీదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ లక్ష్మీ ప్రభ, డాక్టర్ కి శివరాం, డాక్టర్ ప్రేమ్‌సాగర్, డాక్టర్ మద్దిలేటి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, డాక్టర్ అంజిరెడ్డి ,డాక్టర్ రేఖ , వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన హెడ్స్ పాల్గొన్నారు.