Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యాపేటటౌన్ :అగ్నిపథ్‌ను వెనక్కు తీసుకుని పాత పద్ధతిలోనే ఆర్మీలో రిక్రూట్మెంట్ జరపాలని పీఓడబ్య్లూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక,పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి ఎర్ర అఖిల్, పీవైఎల్ జిల్లా నాయకులు గోవుల వీరబాబు డిమాండ్ చేశారు.సికింద్రాబాద్ పోలీస్కాల్పుల్లో మరణించిన వారికి కోటి, గాయపడ్డ వారికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు ఇంటిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం,పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద నిరసన తెలియజేసి మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూఅగ్నిపత్ పేరు తోటి మరోసారి యువతను మోసం చేస్తూ నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత నచ్చితే ఉంచుదాం లేకపోతే లేదు అంటూ మోసపూరిత ప్రకటన చేస్తే యువత ఆవేశానికి లోనై తిరుగుబాటు చేస్తే లాఠీచార్జీలు, టీయర్ గ్యాస్ కాల్పులతో యువత మరణాలకు గాయాలకు కారణమై యువత భవిష్యత్ణు అంధ కారంలోకి నెట్టేస్తున్న మోడీ వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పీఓడబ్య్లూ నాయకులు పద్మ, రేణుక, పీవైఎల్ నాయకులు కొత్తపల్లి వేణు, నరేందర్, పీడీఎస్‌యూ నాయకులు మహేష్ వీరేష్,వెంకటమ్మ,లక్ష్మి, ఉసేన్ పాల్గొన్నారు.
మోతె : అగ్నిపథ్‌ను వెంటనే ఉపసంహ రించుకోవాలని బీఎస్పీ మండల నాయకులు ఏర్పుల సాయికష్ణ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలకేంద్రంలో అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడారు.
తుంగతుర్తి : అగ్నిపథ్‌ను వెంటనే రద్దు చేసి ,సికింద్రాబాద్ ఘటనలో ఎవరి పైన కేసులు పెట్టొద్దని ఆందోళనకారులు శాంతియుతంగా నిరసన తెలపాలని సీపీఐ(ఎం)మండల కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ అన్నారు.మండల కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.