Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమలగిరి : మున్సిపాలిటీపరిధిలోని పదోవార్డులో డ్రయినేజీ సరిగ్గా లేక వీధుల వెంట మురికి నీరు ప్రవహి స్తున్నదని,వెంటనే సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ దష్టికి, అధికారుల దష్టికి తీసుకుపోయినా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారని సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు కడెం లింగయ్య విమర్శించారు.శనివారం ఆయన మాట్లాడుతూ పదో వార్డు ప్రజలు మూడుసార్లు కమిషనర్‌కు వినతిపత్రాలు అందజేశారన్నారు.ఆఫీస్ ముందు ధర్నా చేసిన దున్నపోతు మీద వాన పడిన సామెతగా చేస్తున్నా రన్నారు. మున్సిపల్ కమిషనర్‌కు వార్డు పర్యవేక్షించేందుకు సమయం లేదా మున్సిపల్ కమిషనర్ వాసులు ఆఫీస్‌కు వస్తున్నారా?. లేదా మున్సిపల్ పరిపాలన విధానం ఏవిధంగా ఉందో పదో వార్డు ప్రజలు అడిగిన ఈ ఫొటోటోలు చూసిన తక్షణమే అర్థం అవుతుందని ఈ సందర్భంగా వివరించామన్నారు.మురికి కాలువను చరవాణి ద్వారా అనేక ఫొటోలు తీసి కమిషనర్‌కు వాట్సప్ కూడా చేయడం జరిగిందన్నారు.కనీసం స్పందన లేకపోవడం శోచనీయమన్నారు.మున్సిపల్ అధికారులకు ఏమాత్రం ప్రజలపై చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కాలువ నిర్మాణం చేపట్టాలని, ఈ ప్రాంత ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా చూడాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు.ఈ సమావేశంలో పదో వార్డు ప్రజలు నాగరాజు, లింగయ్య, పూలమ్మ, నర్సమ్మ, లింగమ్మ, వెంకన్న పాల్గొన్నారు.