Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్కట్పల్లి : పట్టణాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జెడ్పీచైర్మెన్ బండా నరేందర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. శనివారం పట్టణంలో కోటి 50 లక్షలతో జరగనున్న అభివద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు.ఈ సంధర్భంగా పట్టణ కేంద్రంలోని 2,5,7,8,12 వార్డుల్లో 40 లక్షల వ్యయంతో సిసి రోడ్లు, డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేసి, మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా కోటి 20 లక్షల తో హై స్కూల్, సత్రంబడి, ఎంపిపిఎస్ లో పలు అభివద్ధి పనులకు వారు శంకుస్థాపన చేశారు, అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ నాయకుడు ఆలోచించని విధంగా భవిష్యత్ తరాల కోసం ఆలోచించిన నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు. రాష్ట్రంలోని పేదింటి కుటుంబాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు, కష్ట కాలంలో ఉన్న రైతన్నకు సంపూర్ణ మద్దతు తెలిపిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పేదింటి ఇళ్ళల్లో వెలుగులు నిండాయన్నారు. అర్హులైన అందరికీ పెన్షన్లను వచ్చే నెలలో అందిస్తామని తెలిపారు,అధైర్య పదొద్దని అందరికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు, ప్రభుత్వ ఫలాలను అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, బిజెపి, కాంగ్రెస్ పార్టీల డ్రామాలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు, మత రాజకీయాలతో చిచ్చు పెడుతున్న మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలనే ప్రభుత్వం కాపాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిజెపిలు రాజకీయ లబ్ధికోసమే తెలంగాణ అభివద్ధికి అడ్డం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ వెళ్లెంలతో పాటు నార్కట్ పల్లి కూడా తన సొంత గ్రామమేనని, నార్కట్ పల్లి పట్టణానికి నిధుల కేటాయింపులో తగ్గేదిలేదని స్పష్టం చేశారు. పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు 22 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ప్రజల అభీష్టం మేరకు, వారి అవసరాల దష్ట్యా నార్కట్ పల్లి పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చేందుకు కషి చేస్తామని తెలిపారు.. పంచాయతీ కో ఆప్షన్ సభ్యులు పసునూరి రవీందర్ నార్కట్పల్లి డిపో మూసివేత పై వస్తున్న ఆరోపణల పై స్పందించాలని కోరగా రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉందని ఆర్టీసీ సంస్థ ను మెరుగుపరిచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిపో నుంచి మరో డిపోకు బస్సులో తరలింపు జరిగింది వాస్తవమే అని తెలిపారు.నార్కట్పల్లి డిపోను ఎత్తివేసే ప్రసక్తేలేదని ఆయన ప్రకటించారు.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి, తహసీల్దార్్ పల్నాటి శ్రీనివాస్ రెడ్డి ,మండల పరిషత్ అభివద్ధి అధికారి యాదగిరి గౌడ్, స్థానిక సర్పంచ్ స్రవంతి, ఎంపీటీసీలు ముత్తయ్య ,దుబ్బాక పావని శ్రీధర్ ,శ్రీనివాస్ రెడ్డి ,యాదయ్య, టీిఆర్ఎస్ మండ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు విష్ణుమూర్తి ఉప సర్పంచ్ పాల్గొన్నారు.