Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ సభకు హాజరు కాని ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ -వలిగొండ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఐదవ విడత పల్లె ప్రగతి మొదటి రోజు నుండి శనివారం ముగిసిన చివరి రోజు ముగింపు గ్రామ సభ కొరకు అసంబద్ధంగా కొనసాగింది, మొదటి రోజున గ్రామసభ నిర్వహించి ఆరోజున గ్రామంలో ఉన్న అన్ని వార్డులోని సమస్యలను గుర్తించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పనిచేయాల్సి ఉంది. మొదటిరోజు గ్రామసభ నిర్వహించి గ్రామం మొత్తం తిరగకుండానే ఒక చోట ఫొటోలకు పోజులిచ్చి మామ అనిపించారు పల్లె ప్రగతి కి సంబంధించిన పలు కమిటీలు హరితహారం కమిటీ పారిశుద్ధ్య కమిటీ అభివద్ధి పనులు కమిటీ వీధి దీపాల కమిటీ ఈ కమిటీ సభ్యుల కన్వీనర్ లకు గ్రామ శాఖ ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వలేదు వీరికి తోడు ప్రజా ప్రతినిధులు అయిన ఎంపీటీసీలు వార్డు మెంబర్లు అందరు కలిసి సమస్యలు గుర్తించి పరిశీలించాల్సి ఉన్నది కానీ ఈ ఒక్క రోజు కానీ గ్రామంలో పర్యటించే లేదు సమస్యలు గుర్తించలేదు కేవలం గ్రామపంచాయతీ పారిశుధ్యం కార్మికుల చేత కొన్ని డ్రైనేజీలు 1,2 అంగన్ వాడి కేంద్రాలు ముందర పారిశుధ్యం, మల్లెపల్లి గ్రామంలో పారిశుధ్య పనులు తప్ప మరొక పనిచేయలేదు శనివారం పల్లె ప్రగతి ముగింపు రోజున ఇటీవల నిర్వహించిన పల్లె ప్రగతి జరిగిన అభివద్ధి పనులు సమీక్ష జరిపి పర్యవేక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరు కూడా హాజరు కాకపోవడం ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు కేవలం వార్డు మెంబర్ మీటింగు ఏర్పాటు చేసి వారు చెప్పిన పనులు మాత్రమే గ్రామ సభలో అసంబద్ధంగా చదివి వినిపించారు గ్రామ సభలో చర్చ జరుగుతుండగానే సర్పంచ్ మధ్యలో వెళ్లి పోవడం గమనార్హం ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బ్రహ్మచారి అంగన్వాడీలు ఆశా వర్కర్లు సిపిఎం పట్టణ కార్యదర్శి గర్ దాసు నరసింహ సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.