Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
గంజాయి, గుట్కా వంటి మత్తుపదార్థాల వ్యాపారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. శనివారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో గుట్కా వ్యాపారం చేస్తున్న నిందితుల వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.మండల పరిధిలోని దొరకుంట గ్రామానికి చెందిన షేక్ ఖయ్యం తన సొంత కారులో బీదర్‌కు వెళ్లి గుట్కాలు , ప్రభుత్వం నిషేధించిన పొగాకు ఉత్పత్తులను తెచ్చి తన అనుచరులైన షేక్ అజిత్, షేక్ ఫయాజ్దీన్ ,సైదులు, షేక్ అమీర్ పాషా, ద్వారా షాపులకు తరలిస్తున్నాడు.ఇదే క్రమంలో పట్టణంలో నయానగర్‌లోని రాయల్ అపార్ట్మెంట్ వద్ద పట్టణపోలీసులు తనిఖీ చేయగా వీరివద్ద నుండి ప్రభుత్వ నిషేధిత లక్ష రూపాయల విలువ గల నిషేధిత గుట్కా బస్తాలు,ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు.నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామన్నారు.నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన పట్టణ సీఐ నర్సింహారావు, ఎస్సై రాంబాబు, నాగభూషణరావు, ఏఎస్ఐ మల్లేష్, కానిస్టేబుల్ గట్టు సతీష్‌నాయుడు, మల్లారెడ్డిలను అభినందించి రివార్డు అందజేశారు.